Mahesh Babu: మహేశ్ సినిమాలు నేను ఎప్పుడూ చూడను: నమ్రతా శిరోద్కర్

  • మహేశ్ సినిమాలు నన్ను ఒత్తిడికి గురి చేస్తాయి
  • ఫ్యామిలీ మొత్తం సినిమా చూస్తుంటే... నేను ఇంట్లోనే ఉంటా
  • ఎప్పుడూ హ్యాపీగా ఉండమని మహేశ్ చెబుతుంటాడు
హీరోయిన్ గా తన కెరీర్ టాప్ లో ఉన్న సమయంలోనే మహేశ్ బాబుతో నమ్రతా శిరోద్కర్ ప్రేమలో పడిపోయారు. మహేశ్ ను పెళ్లి చేసుకోవడానికి దాదాపు ఐదేళ్లు వేచి చూశారు. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహేశ్ కెరీరే తనకు ముఖ్యమని చెప్పారు. తాను మహేశ్ సినిమాలను అసలు చూడనని... ఆయన సినిమాలు తనను చాలా ఒత్తిడికి గురి చేస్తాయని తెలిపారు.

అందరిలాగానే తమ కుటుంబసభ్యులు మహేశ్ సినిమా ప్రివ్యూలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారని... తాను మాత్రం ఇంట్లో కూర్చొని, గోళ్లు కొరుకుతూ, సినిమా హిట్ కావాలని భగవంతుడిని ప్రార్థిస్తుంటానని నమ్రత చెప్పారు. గత సినిమాల కంటే ఈ సినిమా బాగుంటుందా? లేదా? అని ఆలోచిస్తుంటానని... ఇది ఎంతో టెన్షన్ కు గురి చేస్తుంటుందని అన్నారు. అయితే, ఎప్పుడూ హ్యాపీగా ఉండమని మహేశ్ చెబుతుంటాడని తెలిపారు.
Mahesh Babu
namrata sirodkar
tollywood

More Telugu News