Andhra Pradesh: పవన్ కల్యాణే సీఎం అవుతాడేమో.. మెగాబ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

  • అన్ని కులాలను కలుపుకుని వెళుతున్నాం
  • జగన్, చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు
  • ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మెగాబ్రదర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని కులాలను కలుపుకుంటూ వెళుతున్నారని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. తమకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ, వైసీపీ అధినేత జగన్ తో కాని ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఈ మేరకు స్పందించారు.

ఈ సందర్భంగా ‘జగన్ ను సీఎం కానివ్వను’ అని పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించడంతో నాగబాబు మాట్లాడుతూ..‘కల్యాణ్ బాబు జగన్ ను సీఎం కానివ్వడు. చంద్రబాబునూ సీఎం కానివ్వడు’ అని తేల్చిచెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే పవన్ కల్యాణే సీఎం అవుతాడేమో అని వ్యాఖ్యానించారు.

జనసేనలో టికెట్లను అమ్ముకున్నారన్న ప్రచారం కేవలం మీడియా సృష్టి మాత్రమేనని నాగబాబు స్పష్టం చేశారు. తాము ఎవ్వరికీ టికెట్లు అమ్ముకోలేదని చెప్పారు. మీడియా చేసినంత దుర్మార్గం తమ జీవితాల్లో ఎవ్వరూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కింగ్ మేకర్ గా మారితే ఎవరికి మద్దతు ఇవ్వాలో పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాకే తాము తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu
Jagan
Pawan Kalyan
nagababu
Chief Minister

More Telugu News