మహేశ్ బాబు 27వ సినిమాపై ఫిల్మ్ నగర్ టాక్
- మహేశ్ 25వ సినిమాగా వచ్చిన 'మహర్షి'
- 26వ సినిమా అనిల్ రావిపూడితో
- 27వ సినిమా కోసం రంగంలోకి పరశురామ్
ఆయన అనుకున్న దర్శకుల జాబితాలో రాజమౌళి .. త్రివిక్రమ్ .. సుకుమార్ .. సందీప్ రెడ్డి వంగా .. పరశురామ్ వున్నారు. ఈ అయిదుగురు దర్శకుల జాబితాలో మొదటి నలుగురు వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. పరశురామ్ మాత్రం .. మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధంగా వున్నాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. కనుక మహేశ్ 27వ సినిమా పరశురామ్ దర్శకత్వంలో రూపొందే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.