Mahesh Babu: మహేశ్ బాబు 27వ సినిమాపై ఫిల్మ్ నగర్ టాక్

  • మహేశ్ 25వ సినిమాగా వచ్చిన 'మహర్షి'
  • 26వ సినిమా అనిల్ రావిపూడితో 
  • 27వ సినిమా కోసం రంగంలోకి పరశురామ్
మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఇక మహేశ్ బాబు అభిమానుల దృష్టి ఇప్పుడు ఆయన తదుపరి సినిమాపై పడింది. మహేశ్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక 27వ సినిమాను కూడా లైన్లో పెట్టే పనిలో మహేశ్ బాబు వున్నాడు.

ఆయన అనుకున్న దర్శకుల జాబితాలో రాజమౌళి .. త్రివిక్రమ్ .. సుకుమార్ .. సందీప్ రెడ్డి వంగా .. పరశురామ్ వున్నారు. ఈ అయిదుగురు దర్శకుల జాబితాలో మొదటి నలుగురు వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. పరశురామ్ మాత్రం .. మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధంగా వున్నాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. కనుక మహేశ్ 27వ సినిమా పరశురామ్ దర్శకత్వంలో రూపొందే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mahesh Babu
parashuram

More Telugu News