Kamareddy District: పెళ్లయిన రెండు రోజులకే నూరేళ్లు నిండాయి.. రైలు ఢీకొనడంతో నవ వరుడి మృతి

  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
  • భార్యకు సుస్తీ చేయడంతో మందుల కోసం బయటకు
  • పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన డెమో పాసింజర్‌
పెళ్లి ముచ్చట తీరి.. ఆనందమయ జీవితాన్ని ఊహించుకుంటున్న ఆ జంటకు రెండు రోజులకే తీవ్ర విషాదం ఎదురయింది. పెళ్లయిన రెండో రోజునే రైలు ఢీకొట్టిన ప్రమాదంలో వరుడు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి.

దేవునిపల్లికి చెందిన పద్మ, రాములు దంపతుల కొడుకు కిశోర్‌ (25)కు రెండు రోజుల క్రితం పెళ్లయింది. భార్యకు ఒంట్లో బాగోలేకపోవడంతో మందుల కోసమని కిశోర్‌ బయటకు వచ్చాడు. ఏదో ఆలోచించుకుంటూ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో కాచిగూడ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న డెమో పాసింజరు ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. కొడుకు మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులను చూసి చుట్టుపక్కల వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Kamareddy District
Train Accident
one dead

More Telugu News