భానుడి భగభగలకు నేడు, రేపు బ్రేక్.. ప్రజలకు చల్లని కబురు!
- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
- కోస్తాంధ్ర దక్షిణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం
- ఒడిశా నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి
వర్షాలు పడని ప్రాంతాల్లో మాత్రం వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు, కోస్తాంధ్ర దక్షిణ ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఒడిశా నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది.