వాళ్లిద్దర్నీ నిలువరించేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమే: కేజ్రీవాల్
- ఏ పార్టీకైనా మద్దతిచ్చేందుకు సిద్ధం
- అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టిన కేజ్రీ
- రాజధాని నుంచి తరిమికొట్టేలా ఉన్నారని ఎద్దేవా
అమిత్ షా గతంలో ఢిల్లీలోకి చొరబాటు దారులను ఉపేక్షించబోనంటూ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తప్పుబట్టారు. అమిత్ షా మాటలను బట్టి చూస్తే మూడు మతాల ప్రజలను తప్పించి, మిగతావారిని రాజధాని నుంచి తరిమికొట్టే ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించగలిగే పార్టీకే తాము తొలి ప్రాధాన్యమిస్తామన్నారు.