Karimnagar: అపార్ట్‌మెంట్ గోడ కూలడంతో ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

  • కడుతుండగా కూలిన అపార్ట్‌మెంట్ గోడ
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అపార్ట్‌మెంట్ గోడ ఒక్కసారిగా కూలడంతో ఒకరు మృతి చెందగా, నలుగురి కాళ్లు విరిగాయి. కరీంనగర్‌లోని అశోక్‌నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ గోడ కడుతుండగా ఒక్కసారిగా ఏడుగురు కూలీలపై అది కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురి కాళ్లు విరిగిపోయాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
Karimnagar
Ashok Nagar
Apartment
Hospital
Police

More Telugu News