Andhra Pradesh: సెలవుపై వెళుతున్న ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ద్వివేది

  • రేపటి నుంచి ఈ నెల 15 వరకు సెలవు
  • తిరిగి ఈ నెల 16న విధులకు హాజరు
  • క్యాబినెట్ భేటీ జరగొచ్చంటూ సంకేతాలు!
ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళుతున్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ద్వివేది సెలవు పెట్టారు. ఆయన వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నట్టు సమాచారం. తిరిగి ఈ నెల 16న ద్వివేది విధులకు హాజరవుతారు. కాగా, ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ద్వివేది మాట్లాడుతూ, స్క్రీనింగ్ కమిటీ నివేదించిన క్యాబినెట్ భేటీ అజెండాకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించవచ్చని అన్నారు. అయితే, అనుమతి వచ్చేందుకు రెండ్రోజుల సమయం పడుతుందని, బహుశా సోమవారం దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. క్యాబినెట్ భేటీ జరిగేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని ద్వివేది అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh

More Telugu News