Narendra Modi: చంద్రబాబు ఈవీఎం ఆరోపణలపై మొదటిసారిగా స్పందించిన మోదీ

  • అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్ ను తిట్టినట్టుంది
  • గాలి ఎటు వీస్తుందో తెలిసి ఈవీఎంలపై పడ్డారు
  • తొలి మూడు విడతల్లో నన్ను తిట్టి ఆ తర్వాత రూటు మార్చారు
గత కొన్నిరోజులుగా సీఎం చంద్రబాబు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశంపై తన పోరాటాన్ని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. తొలి మూడు విడతల పోలింగ్ సమయంలో తనను దూషించడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత రూటు మార్చారని మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎవరికి అనుకూల పవనాలు వీస్తున్నాయో తెలిసిన తర్వాత ఈవీఎంలపై పడ్డారని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే క్రికెట్ లో కొన్నిసార్లు అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్ ను తప్పుబట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తన పరిస్థితికి ఎన్నికల సంఘంపై నిందలు మోపుతున్నారంటూ చంద్రబాబుపై మోదీ విమర్శలు చేశారు.
Narendra Modi
Chandrababu

More Telugu News