Suryapet District: టీక్లా నాయక్ తండాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల పరస్పర దాడులు!

  • మూడో విడత ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉత్తమ్
  • ఉత్తమ్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ యత్నం
  • టీఆర్ఎస్ కార్యకర్తలను చితగ్గొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని టీక్లా నాయక్ తండాలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడికి పాల్పడ్డారు. మూడో విడత ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆ తండాకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్తమ్ ను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు. కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. 
Suryapet District
peekla nayak tanda
TRS
Congrss

More Telugu News