monkey: జైలులో తనను కోతిలా చూస్తున్నారన్న 'అగస్టా వెస్ట్‌ల్యాండ్' స్కాం నిందితుడు క్రిస్టియన్ మిచెల్

  • యూరోపియన్ బ్రేక్ ఫాస్ట్ అడిగితే నిరాకరించారన్న మిచెల్
  • ఉడకబెట్టిన ఆహారాన్ని తనకు పడేస్తున్నారని ఆవేదన
  • 16 కిలోలు తగ్గానని కోర్టుకు వివరణ
తీహార్ జైలులో తనను కోతిలా చూస్తున్నారని, ఉడకబెట్టిన ఆహారాన్ని తనకు పడేస్తున్నారని అగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కోర్టుకు తెలిపారు. ఈ కారణంగా తాను ఏకంగా 16 కిలోల బరువు తగ్గిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఢిల్లీ ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్.. జైలు అధికారులకు సమన్లు జారీ చేశారు. నేడు కోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించారు.

యూరోపియన్ అల్పాహారం కావాలంటూ జైలు అధికారులను అడిగానని, అందుకు వారు నిరాకరించారని మిచెల్ కోర్టుకు విన్నవించారు. ఇక అప్పటి నుంచి జూలోని కోతిలా తనను చూస్తున్నారని కోర్టుకు తెలిపారు. కాగా, కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్‌ను జరుపుకునేందుకు తనకు మధ్యంతర బెయిలు ఇవ్వాల్సిందిగా మిచెల్ చేసిన అభ్యర్థనను సీబీఐ కోర్టు జడ్జి తిరస్కరించారు.
monkey
zoo
Christian Michel
jail
European breakfast
AgustaWestland chopper scam

More Telugu News