Chandrababu: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల లోక్‌సభ అభ్యర్థులతో నేడు చంద్రబాబు సమీక్ష

  • పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం అనంతరం గురువారం రాత్రి అమరావతికి
  • మరి కాసేపట్లో రెండు జిల్లాల లోక్‌సభ అభ్యర్థులతో సమావేశం
  • శని, ఆదివారాల్లో సమీక్షలకు విరామం
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించి గురువారం రాత్రి అమరావతికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు బిజీగా గడపనున్నారు. పార్టీ నేతలు, లోక్‌సభ అభ్యర్థులతో సమీక్షలు నిర్వహించనున్నారు. తొలుత  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల లోక్‌సభ స్థానాల పరిధిలోని అభ్యర్థులు, పార్టీ నేతలతో మరికాసేపట్లో అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సమావేశం కానున్నారు. శని, ఆదివారాల్లో సమీక్షలకు విరామం ఇవ్వగా తిరిగి సోమవారం నుంచి సమీక్షలు ప్రారంభం కానున్నాయి. సోమవారం కడప, రాజంపేట లోక్‌సభ అభ్యర్థులతో సమావేశం కానున్నారు.
Chandrababu
Amaravathi
Srikakulam District
vizianagaram

More Telugu News