West Bengal: మాపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే మోదీ గుంజీలు తీయాలి: మమతా బెనర్జీ

  • బొగ్గు కుంభకోణంలో ‘తృణమూల్’ సభ్యులు ఉన్నారా?
  • మోదీ చేసిన ఈ ఆరోపణలు నిరూపించాలి
  • నిరూపిస్తే ఎన్నికల బరి నుంచి మా అభ్యర్థులను ఉపసంహరించుకుంటా
బొగ్గు కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారంటూ మోదీ చేసిన ఆరోపణలు కరెక్టు కాదని అన్నారు. ఈ ఆరోపణలను మోదీ నిరూపిస్తే, ఎన్నికల బరి నుంచి తమ పార్టీ అభ్యర్థులు 42 మందిని ఉపసంహరించుకుంటానని సవాల్ విసిరారు. ఈ ఆరోపణలు మోదీ నిరూపించలేని పక్షంలో ఆయన వంద గుంజీలు తీయాలని వ్యాఖ్యానించారు 
West Bengal
CM Ramesh
mamata banerjee
modi

More Telugu News