Tollywood: హీరో విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్..అభిమానులకు ఐస్ క్రీమ్స్

  • ‘ది దేవరకొండ.. బర్త్ డే ట్రక్’ ద్వారా ఐస్ క్రీమ్స్ పంపిణీ
  • విజయ్ దేవరకొండ బర్త్ డే ఈరోజు
  • సీసీ మీడియా నెట్ వర్క్ ఆఫీసులో బర్త్ డే వేడుక
యువ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన అభిమానులకు, ప్రజలకు ఐస్ క్రీమ్స్ అందజేశారు. యువ హీరో ఇచ్చే ఐస్ క్రీమ్ కప్ ను అందుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు.

‘ది దేవరకొండ.. బర్త్ డే ట్రక్’లో వచ్చిన విజయ్ దేవరకొండ హైదరాబాద్ నగరంలోని కొన్ని చోట్ల పర్యటించారు. ఆయా చోట్ల తన అభిమానులకు, ప్రజలకు ఐస్ క్రీమ్స్ అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ‘బర్త్ డే విషెస్’ చెప్పేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని సీసీ మీడియా నెట్ వర్క్ ఆఫీసులో విజయ్ దేవరకొండ తన బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ వేడుకకు ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Tollywood
hero
vijayadevara konda
birth day

More Telugu News