samshabad airport: శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో 3.329 కిలోల బంగారం పట్టివేత

  • విలువ కోటి రూపాయల పైనే 
  • ఇండిగో విమానం దిగిన ప్రయాణికుల నుంచి స్వాధీనం
  • లో దుస్తుల్లో ప్రత్యేక జేబులు ఏర్పాటుచేసి తరలింపు
హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి మూడు కేజీల 329 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో భారీగా స్వాధీనం చేసుకున్న బంగారం కేసుల్లో ఇదొకటి. దుబాయి నుంచి వచ్చిన ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికులు దిగారు. వీరు లో దుస్తుల్లో ప్రత్యేక జేబులు ఏర్పాటు చేసుకుని అందులో బంగారం బిస్కెట్లు ఉంచారు. విమానం దిగిన ప్రయాణికులను తనిఖీ చేస్తున్న కస్టమ్స్‌ అధికారులకు వీరిపై అనుమానం రావడంతో సునిశితంగా తనిఖీచేశారు. దీంతో లోదుస్తుల్లో ఉన్న బంగారం బయటపడింది. ఈ బంగారం విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.
samshabad airport
3.5 kgs gold
customs officers

More Telugu News