bjp: రైతులను మోసం చేసిన రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తా: ప్రధాని మోదీ

షార్ట్స్‌లో చూడండి
కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. హరియాణాలోని ఫతేబాద్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే, రైతులను మోసం చేసిన రాబర్ట్ వాద్రాను జైలుకు పంపించడం ఖాయమని హెచ్చరించారు.

 రైతులను లూటీ చేసిన వారిని కోర్టుకు ఈడుస్తానని అన్నారు. రైతులను మోసం చేసిన వారు తమను ఎవరూ తాకలేరని అనుకుంటున్నారని, అటువంటి వాళ్లను దాదాపు జైలు గుమ్మం వరకూ తీసుకెళ్లానని వ్యాఖ్యానించారు. దేశాన్ని దోచుకున్న వారి నుంచి ఆ సొమ్మును కక్కిస్తానని చెప్పిన మోదీ, ఎన్నికల పోరులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయని ఎద్దేవా చేశారు.  
Go Back to Shorts
bjp
modo
pm
congress
priyanka
vadra

More Telugu News