Raksha: చాలా సార్లు లైంగిక వేధింపులకు గురయ్యా.. చెంప పగులగొట్టా: నటి రక్ష

  • గ్లామర్ పాత్ర చెయ్యమంటే చేయనని చెప్పా
  • ఆయన మీ ఆయనా అంటూ ఎగతాళి చేశారు
  • కథ చెప్పే సమయంలో పరిచయం చేశా
తాను చాలా సార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని, ఆ సమయంలో వాళ్ల చెంపపై లాగి పెట్టి కొట్టానని సినీ నటి రక్ష తెలిపింది. ‘నచ్చావులే’ చిత్రానికి నంది అవార్డును అందుకున్న ఆమె తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించిన ‘రవన్న’ చిత్రంలో నటించా. షూటింగ్ కోసమని విమానంలో చెన్నై వెళ్లేదాన్ని. ఓ రోజు విమానంలో కిటికీ వైపు కూర్చున్నా. నా పక్కన కూర్చున్న ఓ పెద్దాయన చేతితో పొడవడం మొదలుపెట్టాడు. పోనీలే పెద్దాయన అనుకోకుండా తగిలి ఉంటాడులే అని అనుకున్నా. పదేపదే చేయడంతో నాకు పట్టరాని కోపం వచ్చింది. ఇంత వయస్సు వచ్చింది.. ఈ పనులేంటిరా అంటూ లాగి పెట్టి కొట్టాను.

మరోసారి, తమిళంలో ఓ సినిమా కోసం గ్లామర్ పాత్ర చేయమని అడిగితే చేయనని చెప్పా. 'సరే అవసరం లేదులెండి' అని చెప్పి ఒప్పుకుని, తీరా షూటింగ్ సమయంలో మరోలా నటించాలని చెప్పారు. డబుల్ మీనింగ్ అర్థాలు వచ్చేలా నన్ను పొగుడుతున్నారు. నా భర్తను చూపించి ‘ఆయన మీ ఆయనా’ అంటూ ఎగతాళి చేశారు. కథ చెప్పే సమయంలో మా ఆయన్ని వాళ్లకు పరిచయం చేశా. సినిమా షూటింగ్ స్పాట్‌లోనూ పరిచయం చేసినా కూడా విసిగించారు. దీంతో చాలా కోపం వచ్చింది. ఆ డైరెక్టర్ ని ‘ఒరేయ్ ఇలా రారా’ అని పిలిచి, చెంప చెళ్లుమనిపించా. నాకు ఈ సినిమా అవసరం లేదని వచ్చేశా. ఆ తర్వాత హీరో ప్రాధేయపడటంతో డైరెక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు’’ అని రక్ష తెలిపారు.
Raksha
Nachavule
Nandi Award
B.Gopal
Ravanna
Flight

More Telugu News