Gowtham Gambhir: కేజ్రీవాల్ కు అంత సీన్ లేదన్న గౌతమ్ గంభీర్!

  • కేజ్రీవాల్ చెంపపై కొట్టిన గుర్తు తెలియని వ్యక్తి
  • బీజేపీ నేతలే దాడి చేయించారన్న కేజ్రీ
  • కేజ్రీ వ్యాఖ్యలపై స్పందించిన గంభీర్
మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ ట్విట్టర్ వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత శనివారం కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయన చెంపపై కొట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోలో పాల్గొన్న తనపై బీజేపీ నేతలే దాడి చేయించారని కేజ్రీవాల్ ఆరోపించిన నేపథ్యంలో గౌతమ్ దీనిపై స్పందించారు. బీజేపీ దృష్టి పెట్టేంత పెద్ద నాయకుడు అయితే కేజ్రీవాల్ కాదని ట్వీట్ చేశారు.
Gowtham Gambhir
Delhi
BJP
Aravind Kejriwal
Road Show

More Telugu News