Vijayawada: విజయవాడలో ఈదురుగాలుల బీభత్సం!

  • నేల కూలిన చెట్లు, భారీ హోర్డింగ్స్
  • దుమ్మురేగడంతో వాహనచోదకులకు ఇబ్బంది
  • విద్యుత్ సరఫరా నిలిపివేత
విజయవాడలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈరోజు సాయంత్రం వీచిన ఈదురుగాలులకు చెట్లు, భారీ హోర్డింగ్స్ నేల కూలాయి. ఈ గాలులకు దుమ్మురేగడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సిద్దార్ధనగర్ లోనూ ఈదురుగాలులు బలంగా వీచాయి. మామిడి తోటల్లోని చెట్లకు ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. దీంతో, మామిడి రైతులకు నష్టం వాటిల్లింది.
Vijayawada
Hordings
trees
electricity

More Telugu News