ali: అలీ జోడీగా చేయడానికి ఇంద్రజ ఒప్పుకోవడం ఆమెకి ప్లస్ అయింది: ఎస్వీ కృష్ణారెడ్డి

  • 40 సినిమాల దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి 
  • మరిచిపోలేని చిత్రంగా 'యమలీల'
  • ఈ సినిమా వలన ఇంద్రజకి మరిన్ని అవకాశాలు వచ్చాయి     
దర్శకుడిగా .. సంగీత దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 40 సినిమాలలో 'యమలీల' ప్రత్యేకస్థానంలో నిలుస్తుంది. ఈ సినిమా పాతిక సంవత్సరాలను పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో హీరోగా అలీ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆయనను ఎంపిక చేసుకున్న తరువాత కథానాయిక గురించి ఆలోచించాను.

అప్పటికి అలీ కేవలం కమెడియన్ మాత్రమే .. హీరోగా కొత్త. అందువలన ఆయన సరసన చేయడానికి హీరోయిన్స్ ఆలోచిస్తారు. అలా ఆలోచించడం వాళ్ల తప్పు అని కూడా అనలేం. అందువలన కొత్త కథానాయిక అయితే బాగుంటుందని భావించి ఇంద్రజను సంప్రదించాను. అప్పటికి అలీకన్నా నేనే పాప్యులర్ కావడం వలన, 'హీరో ఎవరైనా .. దర్శకుడు మీరు కనుక చేస్తాను సార్' అని ఇంద్రజ ఒప్పుకుంది. ఆ సినిమా ఆమెకి మంచి పేరును .. మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు. 
ali
sv krishnareddy

More Telugu News