digvijay singh: దిగ్విజయ్ సింగ్ రోడ్ షోలో కాషాయం కండువాలు ధరించిన పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
భోపాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నిర్వహించిన రోడ్ షోలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. రోడ్ షో సందర్భంగా మఫ్టీలో విధులకు వచ్చిన పోలీసులు కాషాయ కండువాలు ధరించారు. ఈ రోడ్ షోకు ప్రముఖ హిందూ సాధువు కంప్యూటర్ బాబా హాజరయ్యారు. దిగ్విజయ్ ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్ షో సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ దిగ్విజయ్ నినాదాలు చేశారు.

ఈ రోడ్ షో బందోబస్తుకు వచ్చిన పోలీసులు కాషాయం కండువాలు ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ, 'కంప్యూటర్ బాబా నిర్వహించిన ఈ కార్యక్రమం బందోబస్తుకు మేము వచ్చాం. కాషాయం కండువాలు ధరించాలని నిర్వాహకులు కోరడంతో, వాటిని వేసుకున్నాం' అని చెప్పారు. అయితే,  దీనిపై భోపాల్ డీఐజీ మాట్లాడుతూ, పోలీసులెవరూ కాషాయం కండువాలు ధరించలేదని చెప్పడం కొసమెరుపు.
Go Back to Shorts
digvijay singh
computer baba
bhopal
police

More Telugu News