tej bahadur yadav: తేజ్ బహదూర్ నామినేషన్ ను ఎందుకు తిరస్కరించారు?: ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

  • వారణాసిలో నామినేషన్ వేసినతేజ్ బహదూర్ యాదవ్
  • నామినేషన్ ను తిరస్కరించిన ఎన్నికల అధికారులు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ జవాను

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజక వర్గంలో ప్రధాని మోదీపై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బహిష్కృత బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టును తేజ్ బహదూర్ ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... తేజ్ బహదూర్ నామినేషన్ ను ఎందుకు తిరస్కరించారని ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది. రేపట్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జవాన్లకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టి తేజ్ బహదూర్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. 

More Telugu News