prasuram: మహేశ్ ను ఒప్పించిన 'గీత గోవిందం' దర్శకుడు

  • అనిల్ రావిపూడితో మహేశ్ సినిమా
  •  తదుపరి సినిమా పరశురామ్ తో
  •  స్క్రిప్ట్ పై పరశురామ్ కసరత్తు
పరశురామ్ పేరు వినగానే 'గీత గోవిందం' సినిమా గుర్తుకువస్తుంది. అందమైన ఈ ప్రేమకథాంశం యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. దర్శకుడిగా పరశురామ్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఆయన తదుపరి సినిమా మహేశ్ బాబుతో వుండనుందనేది తాజా సమాచారం. ఇటీవల మహేశ్ బాబును కలిసిన ఆయన, తాను సిద్ధం చేసిన కథను వినిపించాడట. కథ కొత్తగా .. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పిన మహేశ్ బాబు, పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకురమ్మని చెప్పాడట. ప్రస్తుతం పరశురామ్ అదే పనిలో వున్నాడని చెబుతున్నారు. అనిల్ రావిపూడి సినిమా తరువాత మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లేది పరశురామ్ తోనేనని అంటున్నారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో వుండనుందని సమాచారం. 
prasuram
Mahesh Babu

More Telugu News