asanje: ఆయనంటే నాకు చాలా ఇష్టం.. వికీలీక్స్ అసాంజేను జైల్లో కలిసిన పమేలా ఆండర్సన్

  • అసాంజే పరిస్థితి ప్రమాదకరంగా ఉంది
  • ఆయన జీవితాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది
  • ఆయన సంక్షేమం కోసం అందరూ పోరాటం చేయాలి
లండన్ జైల్లో ఉన్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను బేవాచ్ భామ, శృంగార తార పమేలా ఆండర్సన్ కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అసాంజే జీవితం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 'అసాంజేను ఇక్కడ కలవడం బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను కలవడం షాకింగ్ గా ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. అయనంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం ఆయన ఎలాంటి భయంకర పరిస్థితిలో ఉన్నారో కూడా ఊహించుకోలేకపోతున్నా. అసాంజే జీవితాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. భయంకరమైన నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి ఆయన ఎంతో త్యాగం చేశారు. అతని సంక్షేమం కోసం అందరం పోరాటం చేయాల్సి ఉంది' అని ఆమె అన్నారు.

ఈక్వెడార్ ఎంబసీలో అసాంజే తలదాచుకున్నప్పుడు... ఆయనను పమేలా ఆండర్సన్ పలుమార్లు కలిశారు. దాదాపు ఏడేళ్ల తర్వాత అసాంజేకు ఆశ్రయాన్ని ఇవ్వడానికి ఈక్వెడార్ నిరాకరించింది. దీంతో, బ్రిటీష్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అమెరికా సైన్యం చేసిన అనేక దారుణాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నిజాలను వికీలీక్స్ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.  
asanje
pamela anderson
london
jail

More Telugu News