Alwar: అత్యాచారానికి ముందు మెడపట్టి ఈడ్చుకెళ్లారు.. మా దుస్తులు చింపేశారు: అళ్వార్ అత్యాచార బాధితురాలు

  • గత నెల 26న ఘటన
  • బైక్‌పై వెళ్తున్న వారిని అడ్డగించి అత్యాచారం
  • గ్యాంగ్‌కు లీడర్‌ అయిన యువకుడు రెండుసార్లు అఘాయిత్యం
అత్యాచారానికి ముందు నిందితులు తనను మెడపట్టి ఈడ్చుకెళ్లారని, తమ దుస్తులు చింపివేశారని అళ్వార్ అత్యాచార బాధితురాలు తెలిపింది. రాజస్థాన్‌లోని అళ్వార్ జిల్లా థనగజిలో గత నెల 26న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వెళ్తున్న ఓ జంటను అడ్డగించిన ఐదుగురు యువకులు..  యువకుడిపై దాడిచేసి అతడి ముందే వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీశారు. విషయం బయటకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి పరారయ్యారు. బాధితులు గత నెల 30న గజి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు యువకులు బాధితుల బైక్‌ను అడ్డగించారు. అనంతరం యువకుడిపై దాడి చేసి అతడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ‘‘ఆమెను మెడపట్టి ఈడ్చుకెళ్లారు. వారు నా భార్య దుస్తుల్ని చంపేశారు. అనంతరం అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ గ్యాంగ్‌కి లీడర్‌నని చెప్పుకున్న ఒకడు రెండు సార్లు అత్యాచారం చేశాడు’’ అని యువతి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమను డబ్బులు కూడా ఇవ్వాలని బెదిరించినట్టు తెలిపాడు.  
Alwar
gangrape
dragged
Rajasthan

More Telugu News