సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టే: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు
- వివాహితతో యువకుడి సహజీవనం
- మంచి ఉద్యోగం రావడంతో మరో యువతిని పెళ్లాడేందుకు యువకుడు సిద్ధం
- కుదరదన్న హైకోర్టు
ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలరాంకు స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. ఆమెను పెళ్లాడతానని బలరాం మాటివ్వడంతో ఉపాధ్యాయురాలు తన భర్త నుంచి వేరుపడి అతడి వద్దకు వచ్చేసింది. అయితే, ఇటీవల బలరాంకు ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన ఉపాధ్యాయురాలు హైకోర్టును ఆశ్రయించింది. సహజీవనం చేయడమంటే పెళ్లాడినట్టేనని సంచలన తీర్పు వెలువరించింది.