USA: ఉద్యోగులను అమెరికా పంపే భారత ఐటీ కంపెనీలపై ఇక పెనుభారం తప్పదు!

షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి అమెరికాలోకి కొనసాగుతున్న మేధో వలసలపై ఆయన కఠిన ఆంక్షలు ప్రవేశపెట్టారు. అందుకు హెచ్-1బీ వీసాను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటున్న ట్రంప్ ఇప్పటికే దానిపై అనేకరకాలుగా కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. తాజాగా, హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 2020 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ లో ప్రతిపాదనలు చేర్చారు.

ఏఏ కేటగిరీల వ్యక్తులకు ఈ పెంపు వర్తిస్తుందో స్పష్టం చేయకపోయినా, దీని కారణంగా భారతీయ ఐటీ కంపెనీలపై భారం పడనుందని తెలుస్తోంది. తమ ఉద్యోగులను అమెరికా పంపాలనుకునే భారత ఐటీ సంస్థలు హెచ్-1బీ దరఖాస్తు రుసుంను భరించాల్సి ఉంటుంది. ఇది ఆయా సంస్థలకు అదనపు భారంగా పరిణమించనుంది. కాగా, ఈ పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమెరికా యువతకు సాంకేతికపరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కోసం వినియోగించనున్నారు.
Go Back to Shorts
USA
India

More Telugu News