నిర్మాతగా నితిన్ .. ప్రధాన పాత్రధారిగా నిత్యామీనన్
- నితిన్ చేతిలో మూడు సినిమాలు
- సొంత బ్యానర్లో ఒక సినిమా
- త్వరలోనే సెట్స్ పైకి
ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిత్యామీనన్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి విష్వక్సేన్ దర్శకుడిగా వ్యవహరించడమే కాకుండా, ఒక కీలకమైన పాత్రను కూడా చేయనున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. నాయికా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో చేసి మెప్పించడం నిత్యామీనన్ కి అలవాటేననే విషయం తెలిసిందే.