Vizag: విశాఖలో రేవ్ పార్టీ వెనుక పెద్దపెద్ద వాళ్లున్నారు: ఏపీ డీజీపీ

  • రేవ్ పార్టీలో వంద మందికి పైగా డ్రగ్స్ వినియోగించారు
  • ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశాం
  • ఐదుగురు డ్రగ్ సప్లయర్స్ ను గుర్తించాం
విశాఖలో రేవ్ పార్టీ నిర్వహణ వెనుక పెద్దపెద్ద వాళ్లున్నారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవ్ పార్టీలో వంద మందికి పైగా డ్రగ్స్ వినియోగించినట్టు గుర్తించామని, ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఐదుగురు డ్రగ్ సప్లయర్స్ ఉన్నట్టు గుర్తించామని అన్నారు. కాగా, ఈ కేసులో ఎంత పెద్ద వ్యక్తులున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని విశాఖ సీపీ మహేశ్ చంద్ర లడ్డా నిన్న పేర్కొన్నారు.
Vizag
rev party
ap dgp
thakur

More Telugu News