నా శిష్యుడికో న్యాయం... నాకో న్యాయమా!: కేఏ పాల్

షార్ట్స్‌లో చూడండి
విచిత్రమైన హావభావాలు, చిత్రమైన మాటతీరుతో అందరినీ ఆకర్షించే నేత, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి తనకు తోచిన రీతిలో కామెంట్లు చేశారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈ మత ప్రచారకుడు తన భద్రతపై అసహనం వ్యక్తం చేశారు.

ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని, రేవంత్ రెడ్డి అడిగితే క్షణాల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని, తాను అడిగితే కనీస స్పందన కూడా ఉండదని వాపోయారు. "నా శిష్యుడు రేవంత్ రెడ్డికో న్యాయం, నాకో న్యాయమా!" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయని, అయినా ఎవరూ స్పందించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Revanth Reddy

More Telugu News