India: సాంకేతిక సమస్య.. 7,000 బుల్లెట్లను వెనక్కు రప్పించిన రాయల్ ఎన్ ఫీల్డ్!

  • బుల్లెట్, బుల్లెట్ ఎలక్ట్రాలో సమస్య
  • 2019 మార్చి-ఏప్రిల్ మధ్య తయారీ
  • ఉచితంగా రిపేర్ చేస్తామన్న కంపెనీ
ప్రఖ్యాత బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కస్టమర్లకు విక్రయించిన 7,000 బుల్లెట్, బుల్లెట్ ఎలక్ట్రా బైక్ లను వెనక్కు రప్పించింది. తమ ద్విచక్ర వాహనాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయల్ ఎన్ ఫీల్డ్ అధికార ప్రతినిధి తెలిపారు. 2019 మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో తయారైన బైక్ లలో ఈ లోపాన్ని గుర్తించామన్నారు.

ఈ బైక్ లలో బ్రేక్ కాలిపర్ బోల్ట్ సరిగ్గా పనిచేయడం లేదని తాము గుర్తించామన్నారు. తమ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో బ్రేక్‌ కాలిపర్‌ బోల్ట్స్‌ సమస్య తలెత్తిందన్నారు. ఈ సర్వీసును ఉచితంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు.
India
royal enfield
7000 bullets
bring back
called back

More Telugu News