Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు.. ఈ నెల 10న నిర్వహించాలని సీఎస్ కు లేఖ!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశానికి ముహూర్తం ఖరారయింది. ఈ నెల 10న కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సూచించింది. ఇందులో భాగంగా కేబినెట్ అజెండాను రూపొందించాలని ఆదేశించింది. ఈ మేరకు  ఈ నెల 10న ఉదయం 10.30 గంటలకు సమావేశం జరపాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ సీఎస్ కు నోట్ పంపించారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ, అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ కేబినెట్ భేటీలో ఫణి తుపాను ప్రభావం, నష్టపరిహారం, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, వేసవిలో మంచినీటి సమస్యలపై చర్చించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Go Back to Shorts
Andhra Pradesh
cabinet meeting
may 10
cmo
ap cs

More Telugu News