pooja hegde: ఒకే రోజున ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి మూడు షిఫ్టులు పనిచేశాను: పూజా హెగ్డే

  • స్టార్ హీరోల జోడీగా వరుస సినిమాలు
  • రెండు రోజుల్లో  'మహర్షి' విడుదల
  • ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం
పూజా హెగ్డేకి కాలం కలిసొచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె చేసిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆమె తాజా చిత్రమైన 'మహర్షి' ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా వుంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం నా అదృష్టం. ఎన్టీఆర్ తో చేసిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని అందుకోగా, మహేశ్ తో చేసిన 'మహర్షి' రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఇక ప్రభాస్ తో చేస్తోన్న సినిమా సెట్స్ పై వుంది. ఒకానొక సమయంలో ఒకే రోజున ఈ ముగ్గురు హీరోల షూటింగ్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఉదయం 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్ .. మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు మహేశ్ తో .. రాత్రి 9 నుంచి ఉదయం 2 వరకూ ప్రభాస్ తో కలిసి పనిచేశాను. ఇలాంటి అవకాశం రావడం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. 
pooja hegde
ntr
Mahesh Babu
prabhas

More Telugu News