Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి కోల్ కతా వెళ్లనున్న సీఎం

  • వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్యపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ
  • బీజేపీయేతర పక్షాలతో భేటీ కానున్న సీఎం
  • గురువారం సాయంత్రం అమరావతికి తిరిగిరాక
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్యను పెంచాలన్న పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో, బీజేపీయేతర పక్షాల నేతలతో చంద్రబాబు ఈరోజు భేటీ కానున్నారు. ఢిల్లీ నుంచి రేపు ఆయన పశ్చిమబెంగాల్ వెళ్తారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున కోల్ కతా, హల్దియా, ఖరగ్ పూర్ ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం అమరావతికి తిరిగి వస్తారు. 
Chandrababu
delhi
Telugudesam

More Telugu News