Andhra Pradesh: మోదీ దిగజారిపోయి మాట్లాడుతున్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • తెలుగు జాతిని అవమానించేలా మోదీ వ్యాఖ్యలు  
  • ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదు
  • కేసీఆర్ కు, చంద్రబాబుకు తగాదా పెట్టింది బీజేపీయే
ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న మోదీ దిగజారిపోయి మాట్లాడుతున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతిని అవమానించేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబట్టారు.

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోగా, రెండు రాష్ట్రాల వాళ్లు కొట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాలను, జాతిని, భాషలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మోదీపై మండిపడ్డారు. కేసీఆర్ కు, చంద్రబాబుకు తగాదా పెట్టింది బీజేపీయే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఎప్పుడైనా ప్రయత్నించిందా? అని ఆయన ప్రశ్నించారు.
Andhra Pradesh
Telangana
pm
modi
Telugudesam

More Telugu News