Indrasena Reddy: పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్ జన్మదిన వేడుకలపై సీపీ ఫైర్.. విచారణకు ఆదేశం

  • పీఎస్‌లో రవీందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్న సీపీ
పోలీస్ స్టేషన్‌లో సీఐ సమక్షంలో ఓ కాంట్రాక్టర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. కరీంనగర్‌ జిల్లా మానుకొండూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఇంద్రసేనారెడ్డి సమక్షంలో వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన రవీందర్‌ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 4న నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విషయం తెలుసుకున్న సీపీ కమలాసన్ రెడ్డి ఘటనపై సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించిన ఆయన, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పీఎస్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. పోలీస్ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని సీపీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు.
Indrasena Reddy
Kamalasan Reddy
Ravinder Reddy
Karimnagar District
Mankondur

More Telugu News