chandrababu: చంద్రబాబు పర్యటనకు హాజరుకాని జిల్లా కలెక్టర్లు, జలవనరులశాఖ కార్యదర్శి

  • పోలవరంలో పర్యటించిన చంద్రబాబు
  • ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్లు గైర్హాజరు
  • ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం
ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలపై ఈసీ ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈసీ ఆంక్షలను ధిక్కరిస్తూ పోలవరంలో ఈరోజు ఆయన పర్యటించారు. అయితే సీఎం పర్యటనకు ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ లు దూరంగా ఉన్నారు. మిగిలిన అధికారులు కూడా పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. పోలవరం పర్యటన సందర్భంగా కాపర్ డ్యామ్ పనులు, గేట్ల బిగింపు పనులు, మెయిన్ డ్యామ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా హాజరయ్యారు.
chandrababu
polavaram
Telugudesam

More Telugu News