potti veerayya: ఎన్టీఆర్ గారి కాలి బొటనవ్రేలు తాకినా చాలు అనుకున్నాను .. 'గజదొంగ'లో ఛాన్స్ వచ్చింది: పొట్టి వీరయ్య

  • ఎన్టీ రామారావుగారిలో దేవుడిని చూశాను
  • రాఘవేంద్రరావుగారి చుట్టూ తిరిగాను
  •  'గజదొంగ' సినిమాలో చేశాను   
వివిధ భాషల్లో పొట్టి వీరయ్య విభిన్నమైన పాత్రలను చేసి మెప్పించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. " నిజమైన దేవుడిని నేను ఎప్పుడూ చూడలేదు .. రాముడిని .. కృష్ణుడిని నేను ఎన్టీ రామారావుగారిలో చూశాను. ఆయనని ఆ రూపంలో చూసినప్పుడు మనసులోనే దణ్ణం పెట్టుకునేవాడిని.

నేను సినిమాల్లోకి రాక మునుపు ఎన్టీ రామారావుగారి కాలి బొటనవ్రేలు ముట్టుకుంటే చాలు స్వర్గానికి పోతానని అనుకునేవాడిని. అలాంటి ఆయన సినిమా 'గజదొంగ'లో చేసే అవకాశం వచ్చింది. అన్నగారి సినిమాలో వేషం ఇవ్వమని రాఘవేంద్రరావుగారి చుట్టూ మూడు సంవత్సరాలు తిరిగాను. చివరికి ఆయన నాకు 'గజదొంగ'లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ గారితో ఫస్టు సీన్ చేసేటప్పుడు భయంతో కాస్త వెనక్కి వెళ్లాను. ఆయన పలకరింపు ధైర్యాన్ని ఇవ్వడంతో చేయగలిగాను" అని చెప్పుకొచ్చారు. 
potti veerayya

More Telugu News