polavaram: దేవినేని ఉమా! ‘ఎక్కడ రాసిపెట్టుకోవాలి? : అంబటి రాంబాబు

  • 2018 చివరి నాటికి ‘పోలవరం’ నుంచి గ్రావిటీతో నీళ్లిస్తామన్నారుగా?
  • ‘రాసిపెట్టుకోండి’ అని దేవినేని ఉమా అన్నారుగా!
  • ‘ఎక్కడ రాసిపెట్టుకోవాలి?
పోలవరం ప్రాజెక్టును సందర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
‘జగన్.. రాసిపెట్టుకో. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని
మంత్రి దేవినేని ఉమా గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఆ సందర్భంగా ‘జగన్.. రాసిపెట్టుకో’ అని దేవినేని ఉమ వ్యాఖ్యానించారని, ఇప్పుడు అడుగుతున్న ‘ఎక్కడ రాసిపెట్టుకోవాలి?’ అని అంబటి ప్రశ్నించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబూ, ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం’ అని అన్నారు. ఈ నెల 23 వరకే చంద్రబాబు కేబినెట్ మీటింగ్ పెట్టగలరని, ఆ తర్వాత జీవితాంతం కేబినెట్ ను ఏర్పాటు చేయలేరని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని, నూటికి నూరుపాళ్లు టీడీపీ అధికారం కోల్పోతుందని జోస్యం చెప్పారు.
polavaram
project
devineni uma
ambati ram babu

More Telugu News