రెండు సార్లు ఫోన్ చేసినా మాట్లాడలేదు... ఆమెకు అంత అహంకారం!: మమతా బెనర్జీపై మోదీ విమర్శ
- ఫణి తుపాను గురించి మాట్లాడేందుకు మమతకు ఫోన్ చేశా
- మాట్లాడేందుకు ఆమె తిరస్కరించారు
- తుపానును కూడా రాజకీయం చేసేందుకు యత్నించారు
తాను ఫోన్ చేసిన తర్వాత మమత తిరిగి తనకు ఫోన్ చేస్తారని అనుకున్నానని... కానీ ఆమె నుంచి తనకు ఫోన్ రాలేదని మోదీ అన్నారు. అయినా పట్టించుకోకుండా, తాను మరోసారి ఆమెకు ఫోన్ చేశానని... రెండోసారి కూడా ఆమె తనతో మాట్లాడలేదని చెప్పారు. తుపాను నేపథ్యంలో బెంగాల్ ప్రజల కోసం తాను ఎంతో ఆందోళన చెందానని... అందుకే మమతతో మాట్లాడేందుకు యత్నించానని అన్నారు. కానీ, ఆమె రాజకీయాలకే ప్రాధాన్యతను ఇచ్చారని విమర్శించారు.