Andhra Pradesh: నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ఏపీ సీఎం చంద్రబాబు!

  • పనులు జరుగుతున్న తీరుపై సమీక్ష
  • కాంట్రాక్టర్లు, అధికారులతో సమావేశం
  • ఎన్నికలు ముగిశాక రెండోసారి పోలవరంపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మరికాసేపట్లో పోలవరానికి బయలుదేరి అక్కడ పనులు జరుగుతున్న తీరును సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల గురించి అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకుంటారు.

గత నెల 11న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అనంతరం పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఓసారి సమీక్ష నిర్వహించారు. దీంతో ఈ సమీక్షా సమావేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను సమీక్షించడంలో ఎలాంటి ఇబ్బంది లేదనీ, కోడ్ ఉల్లంఘన జరగదని అధికారులు సూచించడంతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు సిద్ధమయ్యారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
polavaram

More Telugu News