Suryapet District: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల బాహాబాహీ

  • సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఘటన
  • కీతవారిగూడెం పోలింగ్‌ బూత్‌ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ
  • ఓటేయడానికి వెళ్లిన అభ్యర్థులు ప్రచారం చేయడంతో రగడ
తెలంగాణలో జరుగుతున్న తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద బాహాబాహీకి దిగారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఓటు వేస్తామంటూ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన ఇరు పార్టీల అభ్యర్థులు లోపల ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో రగడ మొదలయ్యింది. దీంతో వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Suryapet District
garidepalli mandal
TRS Congress clash

More Telugu News