తెలంగాణలో ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలివిడత పోలింగ్
- 197 మండలాల్లో కొనసాగుతున్న ఓటింగ్
- 195 జెడ్పీటీసీ, 2097 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
- 2 జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగుస్తుంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీలకు పింక్ కలర్, ఎంపీటీసీలకు వైట్ కలర్ బ్యాలెట్ పత్రాలు రూపొందించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.