ప్రియురాలి ఇంట్లో ప్రియుడి మృతి.. మదనపల్లెలో కలకలం!
- రెండేళ్లుగా ప్రేమలో శశికుమార్-ఐశ్వర్య
- ప్రియురాలి ఇంట్లో ఉరేసుకున్న ప్రియుడు
- ఇంటికి పిలిచి చంపేశారంటున్న బాధిత కుటుంబం
ఇరు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుండగానే ఆదివారం ప్రియురాలి ఇంటికి వచ్చిన శశికుమార్ అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐశ్వర్య కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శశికుమార్ది హత్యేనని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటికి పిలిపించి హత్య చేశారని చెబుతున్నారు. లేదంటే శశికుమార్ వారింటికి ఎందుకు వెళ్తాడని ప్రశ్నిస్తున్నారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని, దర్యాప్తు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.