Kruti Karbanda: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో హిందీ సినిమాలో కృతి 
  • వెంకటేశ్, నారా రోహిత్ మల్టీస్టారర్ 
  • హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో హన్సిక
*  ఇంతకుముందు తెలుగులో పలు చిత్రాలలో నటించిన కన్నడ భామ కృతి కర్బంద గత కొన్నాళ్లుగా బాలీవుడ్ చిత్రాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇమ్రాన్ హష్మితో మరో చిత్రాన్ని చేయడానికి అంగీకరించింది. గతంలో వీరిద్దరూ కలసి 'రాజ్ రీబూట్' చిత్రంలో నటించారు.
*  ఇటీవల మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్న సీనియర్ నటుడు వెంకటేశ్ మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. నారా రోహిత్ తో కలసి ఓ చిత్రంలో నటించనున్నారు. తమిళంలో హిట్టయిన 'విక్రం వేద' చిత్రం ఆధారంగా ఇది రూపొందుతుంది. వీవీ వినాయక్ దీనికి దర్శకత్వం వహిస్తాడు.
*  ప్రస్తుతం తమిళంలో 'మహా' అనే హీరోయిన్ ప్రధాన కథా చిత్రంలో నటిస్తున్న అందాలతార హన్సిక, తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని అంగీకరించింది. 'జాక్ పాట్' ఫేం కల్యాణ్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. 
Kruti Karbanda
Venkatesh
Rohith
Hansika

More Telugu News