Chandrababu: ఇవాళ మన మధ్యలేని వ్యక్తిపై ప్రధాని వ్యాఖ్యలు చేయడం దారుణం: చంద్రబాబు

  • ప్రధాని స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కావు
  • మోదీ నీచ మనస్తత్వానికి ప్రతీకలు
  • రాజీవ్ పై మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఏపీ సీఎం
"మీ నాన్న రాజీవ్ గాంధీ జీవితం దేశంలో నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగిసింది" అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను ఎవరూ ఆశించబోరని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పదవి వంటి అత్యున్నతస్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి ఎవరైనా సభ్యత, సంస్కారం, హుందాతనం ఆశిస్తారని, కానీ, ఈ వ్యాఖ్యలు ప్రధాని నీచ మనస్తత్వానికి ప్రతీకలుగా భావించాల్సి వస్తోందని తెలిపారు.

ఇవాళ మన మధ్యలేని దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ విమర్శలు చేయడాన్ని తాము ఖండిస్తున్నట్టు చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు నాగరికత సరిహద్దులు దాటి వ్యక్తి గౌరవమర్యాదలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని వివరించారు.
Chandrababu
Narendra Modi

More Telugu News