Andhra Pradesh: నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఏపీ... అగ్నిగోళంలా ప్రకాశం జిల్లా దొనకొండ!

  • 52 ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
  • 127 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదైన వైనం
  • వడగాడ్పుల హెచ్చరికలు చేసిన ఆర్టీజీఎస్
ఫణి తుపాను అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వాతావరణంలోని తేమను ఫణి తుపాను లాగేసుకోవడంతో వాతావరణం అత్యంత పొడిగా మారిపోయింది. దానికి తోడు భానుడి భగభగలు, పశ్చిమం నుంచి వీస్తున్న వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రకాశం జిల్లా దొనకొండలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లా జి.కొండూరులో 45.89 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో నేడు 52 ప్రాంతాల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదు కాగా, 127 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదైంది. ఆర్టీజీఎస్ ఇంతకుముందే ప్రజలకు వడగాడ్పుల హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh

More Telugu News