pm: మోదీకి గుజరాత్ తప్ప ఏవీ కనపడట్లేదు: సీఎం చంద్రబాబు విమర్శలు

  • విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్నీ పట్టించుకోలేదు
  • 98 శాతం హామీలు నెరవేర్చామని చెప్పడం దారుణం
  • అన్ని అంశాల్లోనూ ఏపీని ఇబ్బంది పెడుతున్నారు
ప్రధాని నరేంద్ర మోదీకి గుజరాత్ రాష్ట్రం తప్ప ఇంకా ఏవీ కనపడట్లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో ప్రజావేదికలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్నీ పట్టించుకోలేదని, 98 శాతం హామీలు నెరవేర్చామని మోదీ చెప్పడం దారుణమని విమర్శించారు. హామీలు అమలు చేయాలని కోరితే పదేళ్ల సమయం ఉందని, ఇప్పుడే అన్నీ అమలు చేయాలా? అని ప్రశ్నిస్తుండటం విడ్డూరంగా ఉందంటూ నిప్పులు చెరిగారు. అన్ని అంశాల్లోనూ ఏపీని ఇబ్బంది పెడుతున్నారని, ఎమ్మెల్యే, ఎంపీలు, పారిశ్రామికవేత్తలపై ఐటీ, ఈడీ దాడులు చేశారని, హామీల అమల గురించి అడగనన్నీ రోజులూ ఇలాంటివి జరగలేదని విమర్శించారు.
pm
modi
cm
Chandrababu
Andhra Pradesh

More Telugu News