Andhra Pradesh: మనవడితో ఆటలాడితే ఆ కిక్కే వేరప్పా.. ఫొటోలు పోస్ట్ చేసిన గంటా శ్రీనివాసరావు!

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి టూర్ కు వెళ్లిన గంటా శ్రీనివాసరావు మనవడితో ఆడుకుంటూ హాయిగా గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనవడితో ఆడుకుంటున్న ఫొటోలను గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గంటా విశాఖ ఉత్తరం నియోజవకర్గం నుంచి పోటీ చేశారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ లోపునే గంటా ఏపీకి తిరిగివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. కాగా, తాము విహారయాత్ర కోసం ఎక్కడకు వెళ్లామన్న విషయమై గంటా శ్రీనివాసరావు స్పష్టత ఇవ్వలేదు.

Go Back to Shorts
Andhra Pradesh
Ganta Srinivasa Rao
tour
vacation
Twitter

More Telugu News